ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలి పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో వందల గ్రామాలు వరద నీటితో మునిగి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని జనసేన నేత పవన్ కళ్యాణ్ అన్నారు. వరద తీవ్రత తగ్గుముఖం పట్టిన ముంపు బాధితుల కష్టాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వేల మంది వరద బాధితులు ఉంటే పునరావాసం కింద కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి వైకాపా ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుందని కనీసం పడవలు కూడా ప్రజలకు ఏర్పాటు చేయలేదని ఆహారం మంచినీళ్లు బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు రెండు సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వైకాపా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా చెబుతున్న అవి పేపర్లకే అంకితం అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు.



