తెలంగాణ
వరదలతో రూ.1400కోట్ల నష్టం.. ….
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను
రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల
నష్టం సంభవించినట్లు నివేదికలో తెలిపింది. వెంటనే తక్షణ సాయం కింద రూ.వెయ్యి
కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు
కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం
వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.449 కోట్లు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో రూ.33 కోట్లు,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ.379కోట్లు. విద్యుత్‌శాఖలో రూ.7కోట్ల నష్టం జరిగినట్లు ఆయాశాఖలు
ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి అందించాయి.



