తెలంగాణముఖ్యాoశాలు
నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది…….పోలీసులు ఛేదించడంలో కూడా వారి చాకచక్యం మరింత పెరిగింది

నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది నేరం జరిగిన తర్వాత పోలీసులు ఛేదించడంలో కూడా వారి చాకచక్యం మరింత పెరిగింది అయినప్పటికీ నేర స్వభావం ఉన్న వ్యక్తులు సమాజంలో ఎక్కువ కావడం ప్రతి రోజు ఏదో ఒక మిస్సింగ్ కేస్ మర్డర్ కేస్ లేదా రేప్ కేస్ ఇలా రోజు వినాల్సిన పరిస్థితి వస్తుంరాష్ట్రంలో సగటున ప్రతి రెండు రోజులకు ఐదు చొప్పున హత్యలు.. 15 కిడ్నా్‌పలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో హత్యల సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక-2021లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హత్యల్లో ముఖ్యంగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలు, వ్యక్తిగత కక్షలు, వరకట్నం వంటి అంశాలు కారణాలుగా ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 28,605 హత్య కేసులు నమోదవ్వగా.. వాటిలో తెలంగాణ వాటా 1,026. తెలంగాణలో 2019లో 839, 2020లో 802 హత్యలు జరగ్గా.. ఈ సంఖ్య గత ఏడాది అనూహ్యంగా పెరిగింది. అత్తింటి వారి వరకట్న దాహానికి 41 మంది అబలలు బలయ్యారని ఈ నివేదిక స్పష్టం చేసింది. వ్యక్తిగత కక్షలతో 52 మంది, ప్రేమ వ్యవహారాలతో 23 మంది, వివాహేతర సంబంధాల కారణంగా 115 మంది హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో ప్రతి 48 గంటల్లో 15 మంది కిడ్నాప్ అయినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. 2021లో రాష్ట్రంలో 2,760 మంది కిడ్నాప్‌లు జరిగాయి. అపహరణకు గురైన వారిలో 18 ఏళ్లలోపు వారి సంఖ్య 1,785 కాగా అందులో బాలికల వాటా 1526. గత సంవత్సరం రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి 20,865 కేసులు నమోదయ్యాయి. అంటే.. ఈ కేటగిరీలో సగటున ప్రతి అరగంటకో నేరం జరుగుతోంది. గత ఏడాది మొత్తం 823 అత్యాచారం కేసులు నమోదవ్వగా.. వీటిల్లో కేవలం 4 కేసుల్లో మాత్రమే నిందితులు బాధితులకు పరిచయం లేనివారు. మిగతా కేసుల్లో బాధితులకు పరిచయస్థులే దారుణానికి ఒడిగట్టారు. మానవ అక్రమ రవాణాలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది రాష్ట్రంలో 347 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అందులో 222 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే చిన్నారులపై నేరాలు పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2021లో చిన్నారులపై 5,667 నేరాలు జరిగాయి.గత సంవత్సరం రాష్ట్రంలో 15 మంది విదేశీయులపై పలు రకాల నేరాలు జరిగాయి. గడచిన మూడు సంవత్సరాలతో పోలిస్తే విదేశీయులపై నేరాలు రెండింతలు పెరిగాయి. కర్ణాటక, తమిళనాడు తర్వాత విదేశీయులపై నేరాలు అత్యధికంగా తెలంగాణలో నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2021లో రాష్ట్రంలో జరిగిన 40 నేరాల్లో విదేశీయులు నిందితులుగా ఉన్నారు. చీటింగ్, మానవ అక్రమ రవాణాతోపాటు ఇతర కేసుల్లో వీరిపై అభియోగాలున్నాయి.తెలంగాణలో గత సంవత్సరం 3,956 మంది చిన్నారుల మిన్సింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,382 మంది బాలురు కాగా.. 2,574 మంది బాలికలు ఉన్నారు. అంటే.. ప్రతి 24 గంటలకు సగటున 10 మంది మిస్సయ్యారు. అయితే.. చాలా కేసుల్లో తెలంగాణ పోలీసులు ‘దర్పణ్ యాప్’ సాయంతో తప్పిపోయిన వారిని గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు.



