
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించనున్నట్టు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 24న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి పరిపాలనా భవనం నుండి అన్నమయ్య ఉత్సవ విగ్రహం ఊరేగింపు మొదలవుతుంది. కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళతారు. సాయంత్రం 6 గంటల నుండి మరుసటిరోజైన మంగళవారం సాయంత్రం వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా కళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.



