చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం…..పలువురికి గాయాలు

సోoపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగింది. చంద్రబాబుతో టీడీపీ నేతలు పంటుదిగేందుకు ఒక్కసారిగా పంటు చివర ర్యాంపు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబును తొలుత భద్రత సిబ్బంది పంటు నుంచి నాటు పడవ ఎక్కించారు. వేరొక నాటు పడవ ఎక్కేందుకు ర్యాంపు మీదకి నేతలంతా రావటంతో ఒక్కసారిగా తెగి గోదావరిలో పడిపోయింది. బరువు కారణంగా పంటు ముందు భాగం రెక్క తెగింది. దీంతో ఒక్కసారిగా మాజీ మంత్రులు దేవినేని ఉమా , పితాని సత్యనారాయణ , ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు , ఎమ్మెల్యే రామరాజు , నేతలు కలవపూడి శివ, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు. వెంటనే లైఫ్ జాకెట్లు వేసి వారిని సిబ్బంది కాపాడారు.మాజీ సర్పంచులు మాజీ జెడ్పిటిసిలు మాజీ జడ్పీ చైర్మన్లు ఈ కార్యక్రమంలో ఉన్నారు అయితే ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒడ్డుకు సమీపంలోనే ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది




