ఆంధ్రప్రదేశ్
వైసీపీ చట్టవ్యతిరేక ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోంది : వర్ల రామయ్య

వైసీపీ చట్టవ్యతిరేక ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోంది……..: వర్ల రామయ్య
వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
మాజీమంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలోనే.. చికోటి ప్రవీణ్ గుడివాడలో
కెసీనో నిర్వహించారని ఆరోపించారు. నేపాల్ కెసీనోకు వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలేనని
వెల్లడించారు. కొంతమంది మంత్రులు చదువుకున్న వారికి ప్రజల ముందు ఏం మాట్లాడాలి ఎలా
నడుచుకోవాలి ఎదుటివారిని ఎలా గౌరవించాలి అనేది తెలియదువైసీపీ ప్రభుత్వానికి నేపాల్ కెసీనోకు
వెళ్లిన.. ప్యాసింజర్స్ లిస్టు బయటపెట్టే ధైర్యం ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ నేతల
ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు. కెసీనో ద్వారా కొడాలి నాని, వల్లభనేని వంశీ.
. ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానని వర్ల రామయ్య ప్రకటించారు.




