ఆంధ్రప్రదేశ్
ఏలూరు జిల్లా కలెక్టర్‌ను రెండు గంటలకుపైగా అడ్డుకున్న వరద బాధితులు
వేలేరుపాడు మండలం, బండ్లబోరు వద్ద కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను వరద బాధితులు
అడ్డుకున్నారు. వరద సహాయం అందించడంలో అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని
ఫిర్యాదు చేశారు.వరద సహాయం అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పటం లేదని
వేరే వేరే కారణాలు చెబుతున్నారని ,పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు.
గ్రామస్థుల ఆందోళనతో రెండు గంటలకుపైగా అక్కడే కలెక్టర్ ఆగిపోయారు. సమాచారం
తెలుసుకున్న ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వారించే
ప్రయత్నం చేశారు. చివరికి కలెక్టర్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.
వేలేరుపాడు మండలం, కొయిదాలో శనివారం సాయంత్రం పోలవరం నిర్వాసితులతో కలెక్టర్
సమావేశం జరిగింది. తిరిగి వస్తున్న సమయంలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.




