భూముల తనఖాకు, వేలంలో కొనడానికి ఎవరూ ముందుకురావడంలేదు.
ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకుని వాడుకోవడం
జగన్ ప్రభుత్వం విధానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం
ఖజానా ఆదాయం మళ్లించే మోడల్స్‌ను తెచ్చారు. గ్యారెంటీ అప్పులు, నాన్ గ్యారెంటీ
అప్పులు అన్నీ కలిసి రాష్ట్రంలోని కార్పొరేషన్లకు బ్యాంకులు ఇప్పటికే రూ.2.5 లక్షల
కోట్లు ఇచ్చాయి. ఇందులో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఏపీ టిడ్కో, విద్యుత్ రంగ సంస్థలు
ప్రధానం. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నెత్తిన రూ.42,000 కోట్ల అప్పు ఉంది. అలాగే, టిడ్కో
పేరుతో కూడా రూ.7,000 కోట్ల వరకు ప్రభుత్వం అప్పు తెచ్చింది. విద్యుత్ రంగ సంస్థలది
మరో సమస్య. ఆ సంస్థలకు ప్రధాన వినియోగదారు ప్రభుత్వమే. సబ్సిడీ కరెంటు,
వ్యవసాయానికి ఉచిత కరెంటు అంటూ ఆ సంస్థలకు ప్రభుత్వం ఏడాదికి దాదాపు
రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు బాకీ పడుతోంది. ఇందులో
ఒక్కపైసా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆ బకాయిలు తీర్చడం కోసం
విద్యుత్ రంగ సంస్థలు నాన్ గ్యారెంటీ అప్పులు చేస్తున్నాయి. ఇందుకోసం వీధుల్లో
ఉండే కరెంటు లైన్లు, థర్మల్ స్టేషన్లు, సబ్ స్టేషన్లు, ప్లాంట్లు, ఇతర ఆస్తులు తనఖా
పెట్టి అప్పులు చేస్తున్నాయి. వీటిని చెల్లించే భారం కూడా ప్రభుత్వానిదే.
పైగా ఈ గ్యారంటీ అప్పులను 2020 మార్చి నుంచి ప్రభుత్వం అప్డేట్ చేయడం లేదు.
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారమైతే మరీ దారుణంగా ఉంది.
భూముల తనఖాకు, వేలంలో కొనడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో
ఇంటింటిపై జాతీయ జెండానేరుగా… ఆ భూములు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.




