ఆంధ్రప్రదేశ్

గడప గడపకు కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే కి షాక్ ఇచ్చిన వృద్ధురాలు..

గడప గడపకు ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగిలాయి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను
వివరించాలని , ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్స్
ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్క నేత ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వ పధకాలను
అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే
తగిలాయి. చాలామంది నేతలను ప్రజలు నిలదీయడం జరిగింది. తాజాగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి
కి ఓ వృద్ధురాలు పెద్ద షాక్ ఇచ్చింది. అవ్వ నువ్వు ఎవరికీ ఓటు వేస్తావు అంటే ఏమాత్రం ఆలోచించకుండా
చంద్రబాబుకే ఓటు వేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఆదోని 17వ వార్డులో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో
ఆదోని 17వ వార్డులో పర్యటించిన ఆయన.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి
ఓ వృద్ధురాలికి వివరించారు. ఎమ్మెల్యే చెప్పిందంతా ఆమె శ్రద్ధగా విన్నది. తర్వాత ఓటేవరికి వేస్తావో
చెప్పమ్మా అని అడగ్గా.. చంద్రబాబుకు ఓటేస్తానంటూ ఆ వృద్ధురాలు తడుముకోకుండా చెప్పడం తో ఎమ్మెల్యే షాక్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker