బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా విశేష సేవలు అందించిన వారికి ఘనంగా సన్మానం

:బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా విశేష సేవలు అందించి
వారికినశాలువా, మెమెంటో లను అందజేసి సన్మానించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఆశాడ బోనాల ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఎంతో ఘనంగా, ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్కొండ, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా విశేష సేవలు అందించిన GHMC, వాటర్ వర్క్స్, హెల్త్, పోలీసు, ట్రాఫిక్, ఫైర్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, దక్కన్ మానవ సేవాసమితి, ఆర్య సమాజ్, స్కౌట్ గైడ్స్ తదితర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రింట్ మరియ ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLC ప్రభాకర్ రావు, MLA మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్ లు అమయ్, హరీష్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV. ఆనంద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ లు జోనల్ కమిషనర్ లు, DCP లు, ACP లు, వాటర్ వర్క్స్ GM లు, అధికారులు, సిబ్బందిని, ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను శాలువా, మెమెంటో లను అందజేసి సన్మానించారు. తమ సేవలను గుర్తించి సన్మానించడం పట్ల పలువురు అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.



