తెలంగాణముఖ్యాoశాలు
రాజగోపాల్ రెడ్డి ని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి ఫైర్

ఎంగిలి మెతుకుల కోసం పార్టీని వీడి విశ్వాస జాతకం చూపించారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రజలకు బిజెపి అసలు స్వరూపాన్ని చూపిస్తుందని లోక్ సభ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరాన్ని మోడీ అవహేళన చేశారని కాంట్రాక్టుల కోసమే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు మోడీ అమిత్ షా ఇచ్చిన కాంట్రాక్టర్ల కోసం కొందరు పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఈ డి బిజెపికి ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారిందని ఈ డి ద్వారా అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేధిస్తున్నారని సోనియా కోసం పోరాడాల్సిన సమయంలో అమిత్ షా దగ్గర కూర్చొని కాంట్రాక్టులు కుదుర్చుకున్న వారికి విశ్వాసం ఉందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అన్నారు


