ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

2024 లో వచ్చే ఎన్నికల్లో కుప్పం అభ్యర్థి భరత్…. గెలిస్తే మంత్రి పదవి…. సీఎం జగన్

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తాము గెలుచుకుంటామని మా దగ్గర ఆ సత్తా ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు
కుప్పం పర్యటనలో ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ కుప్పంలో వైసిపి అభ్యర్థిగా భరత్ ను నియమిస్తున్నామని భరత్
నీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ సమావేశంలో హామీ ఇచ్చారు కుప్పం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలో
ఆయన చెప్పుకొచ్చారు కుప్పం మున్సిపాలిటీలో జరగాల్సిన వివిధ రకాల అభివృద్ధి పనులకు భరత్ ఇచ్చిన ప్రతిపాదన 65 కోట్లు
ఉంటుందని దానిని మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు మరో రెండు రోజుల్లో జీవో విడుదల చేయిస్తానని పనులు కూడా
మొదలుపెట్టొచ్చునని కుప్పానికి సంబంధించిన ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరిస్తానని ఆయన చెప్పారు ఈ మూడేళ్లలో
కుప్పం నియోజకవర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని ఈ నియోజకవర్గానికి అండగా ఉంటానని ఆయన పార్టీ నేతలకు చెప్పారు
ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి కూడా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker