ఆంధ్రప్రదేశ్

దేవేందర్ రెడ్డి,.. విజయసాయిలపై వర్ల రామయ్య ఫిర్యాదు…… కఠిన చర్యలు తీసుకోవాలి

అమరావతి టీడీపీ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు
గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి , విజయసాయి రెడ్డి లపై టీడీపీ నేత వర్ల రామయ్య సీఐడీ ఏడీజికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా
తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న
గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి,నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారన్నారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం,
ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో దేవేంధర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు. ఈనెల 3న ఏ2 విజయ సాయిరెడ్డి సైతం టీడీపీ
నాయకుల హత్యా రాజకీయాల పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేశాని వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై నక్కా ఆనంద్ బాబు,
ఆలపాటి రాజా, అశోక్ బాబు పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సీఐని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా
ప్రవర్తించారని మండిపడ్డారు. తమ నాయకులపై అసభ్యకరంగా మాట్లాడారని, ఇప్పటి వరకు తమ పిర్యాదుపై ఎటువంటి
కేసు నమోదు చేయలేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని,
పిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని
వర్ల రామయ్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker