ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు

దొరికితేనే దొంగ.,…. వాసవి …..ఫెనిక్స్…… సాహితి ……..ఆర్థిక నేరగాళ్లే

 ప్రజల రక్తం పిండి వసూలు చేసిన రియల్ దందా
జగన్ నుండి లక్ష్మీనారాయణకు  పెద్ద అభయహస్తం?

 తప్పు చేసిన వాడిని దొంగ అంటారు, మోసం చేసిన వాడిని మోసగాడు అంటాం ,అలాగే ప్రజల రక్తం తాగిన వాడిని రాక్షసులు అంటాం, ఇలాంటి వాళ్ళు భూమి మీద అది కూడా హైదరాబాద్ పరిధిలోనే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా వాసవి గ్రూప్, ఫెనిక్స్ కంపెనీ, ఇటీవల 1600 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన సాహితీ, వీరు ఒకరికొకరు చాలా దగ్గర సంబంధాలు పెట్టుకుని తెలివిగా ప్రజలను మోసం చేశారు. వాస్తవానికి వాసవి గ్రూపులో ఉన్న భూములను, ఫినిక్స్ కి అమ్మారు, ఫినిక్స్ దగ్గర నుండి సాహితీ వాళ్లు కొన్నారు. ప్రభుత్వ భూమి అని తెలియక చాలామంది పెద్ద కంపెనీలు అద్దాలమేడల్లో చూపిస్తుంటే చూసి మురిసిపోయి సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశతో ఎక్కడి నుంచో అప్పు తెచ్చి బంగారం అమ్మి ఈ కంపెనీలకు ధారబోశారు. కానీ ఈ కంపెనీ నుండి దాదాపు తెలంగాణ మొత్తంలో సగం మంది మోసపోయిన వారే ఉన్నారు .పేరుకి పెద్ద కంపెనీలు చేసేది దొంగ పనులు ,ప్రజల రక్తం పిండి వసూలు చేసి కేసులు పెట్టుకోండి రాజీలు చేసుకుంటాం, అని పోలీసు వాళ్లకి కావలసిన మేరకు మొట్ట చెప్పుకొని ,తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాహితీ ఎండి బుధాటి లక్ష్మీనారాయణ ను  సిసిఎస్ పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తున్నారా ? ఎవరు డబ్బులు వారికి తిరిగి వస్తాయా, అది అయోమయంగా మారింది. ఇప్పటికీ దాదాపు 40 రోజులు పైన అయినా గాని నష్టపోయిన వారి వైపు ఎవరు కన్నెత్తి చూడటం లేదు, అధికారులకు దగ్గర ఉలుకు పలుకు లేదు, రాజకీయ నాయకులు ఉండనే ఉన్నారు బుధాటి లక్ష్మీనారాయణ వెనుక ఏపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని అందరికీ తెలుసు .తెలంగాణలో బుదాటి లక్ష్మీనారాయణకి అంతకంటే ఎక్కువ టిఆర్ఎస్ నాయకులు అండదండలు ఉన్నాయి, లేకపోతే చిన్న తప్పు చేసిన వారిని పిలిచి వారిని దండించి ఆపై ప్రెస్ మీట్ పెట్టి పేపర్లో ఫోటోలు ఏపిచ్చుకునే పోలీసులు మరి బుధాటి లక్ష్మీనారాయణ ను ఎందుకు మీడియా ముందు ప్రవేశ పెట్టలేదు. దీని వెనక ఏదైనా అదృశ్య శక్తి ఉందా ,లేదా సిసిఎస్ పోలీసులు కూడా లక్ష్మీనారాయణ ఇచ్చిన విరాళాలు తీసుకుని మీన్నకుoడిపోయారా ,సిసిఎస్ పోలీసులు చేసే ఏ పనైనా ప్రజల మేలుకోసమేనని అందరికీ తెలిసిన మాట, అయినప్పటికీ ఎక్కడో ఎంతో కొంత బయం  వందల మందిలో ఉంది. చాలామంది ఇంటికి కూడా పోకుండా బజార్లు వెంట తిరుగుతున్నారు. వడ్డీకి డబ్బులు తెచ్చిన వారు వడ్డీలు కట్టలేక సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. కుటుంబాలను సర్వనాశనం చేసిన  లక్ష్మీనారాయణ తిరుపతి వెంకనారాయణ  దగ్గర గుడి మెంబర్గా ఉండడం చాలా దురదృష్టకరం. అభియోగం వచ్చి 40 రోజులు అయిన టీటీడీ మెంబర్గా ఆయన్ని కొనసాగించటం జగన్ నుండి లక్ష్మీనారాయణకు  పెద్ద అభయహస్తం ఉందో అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ పై ఉన్న ఆ మచ్చను చెరిపి వేసుకోవడానికైనా జగన్ బుధాటి లక్ష్మీనారాయణ పదవి నుంచి తప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker