ఆంధ్రప్రదేశ్
11న నాలుగో జగనన్న విద్యా దీవెన కార్యక్రమ ప్రారం భోత్సవానికి బాపట్ల వస్తు న్నా ముఖ్యమంత్రి

11న నాలుగో జగనన్న విద్యా దీవెన కార్యక్రమ ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి బాపట్ల వస్తు న్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి బాపట్ల పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట ్లలో నిమగమైంది. ఈ నెల 11న నాలుగో జగనన్న విద్యా దీవెన కార్యక్రమ ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి బాపట్ల వస్తు న్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకష్ణన్, ఎస్‌పి వకుల్ జిందాల్‌తో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనకు అనువైన ప్రదేశాలను మంత్రిమేరుగ నాగార్జున, శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్, ఎస్‌పి పరిశీలించారు. ముందుగా సభావేదిక, విఐపి గ్యాలరీలు, వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు.. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల వ్యవసాయ కళాశాల, బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, జిల్లా ఎస్పీ కార్యాలయం పోలీస్ గ్రౌండ్‌ను పరిశీలించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు. సభా వేదిక బాపట్ల సైన్స్ కళాశాలలో, హెలీప్యాడ్ జిల్లా ఎస్పీ కార్యాలయం పోలీస్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా ప్రదేశాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. బాపట్ల జిల్లా ఏర్పడ్డాక తొలిసారిగా బాపట్లకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహనరెడ్డి పాల్గొనే కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు
[




