ఆంధ్రప్రదేశ్
నియోజకవర్గ ఇన్‌చార్జీలతో చంద్రబాబు సమావేశం

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ ఇన్‌చార్జ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగో రోజు పార్వతీపురం, రంపచోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో స్థానిక రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. ప్రతి ఇన్చార్జ్ నియోజకవర్గంలో కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. అబ్జర్వర్‌గా ఉన్న నేతలు సైతం నెలలో కనీసం 8 రోజులు ఆ నియోజకవర్గంలో పర్యటించాలని సూచించారు. అసత్య ప్రచారమే వైసీపీ తన ప్రచార అస్త్రంగా చేసుకుందని దాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని ఇన్‌చార్జీలకు సూచించారు. స్థానిక సమస్యలపై ప్రజలను కలుపుకొని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు పర్యటించనున్నారు. 24 ,25, 26 తేదీల్లో కుప్పం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. కాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు (ఆదివారం) శ్రీకాకుళం పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు గురైన కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించనున్నారు.




