కాంగ్రెస్ పార్టీని మోసగించిన నయవంచకుడు…సోనియాను ఈడీ వేధిస్తుంటే షా పక్కన చేరాడు

అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పాల్సింది
రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం.
మునుగోడు ఎమ్మెల్యే, త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీచుడు, దుర్మార్గుడు, కమీనే
అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నయవంచన చేసిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు
గడ్డపై పాతిపెట్టాలని, వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు
పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్
పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు.మునుగోడు నియోజకవర్గంలోని
చండూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభకు భారీ స్పందన లభించింది. అంచనాలకు
మించి జనం, పార్టీ శ్రేణులు కదలివచ్చారు. వర్షాలు భారీగా పడుతుండడం, ప్రజలు
పొలం పనుల్లో బిజీగా ఉండడంతో సభకు ఏ మేరకు వస్తారోనన్న సంశయం ఉన్నా..
సాయంత్రం 4గంటలకే సభాస్థలి నిండిపోయింది. భారీ సంఖ్యలో హాజరైన జనం..
జోరుగా వర్షం కురుస్తున్నా కదలకుండా రేవంత్ ప్రసంగాన్ని వింటూ నిలబడిపోయారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి,
నల్లగొండ జిల్లా నాయకులు రెండు రోజుల వ్యవధిలోనే సభ నిర్వహించాలని నిర్ణయించడం,
సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నియోజకవర్గం
ఏర్పడిన తర్వాత 12 సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం
సాధించారు. స్థానికంగా కిందిస్థాయిలో కాంగ్రె్‌సకు బలమైన క్యాడర్ ఉంది. దీంతో సభ
విజయవంతం కాకుండా రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అనేక ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి
నుంచి విందులు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల నుంచి సభకు జనం వెళ్లకుండా చూడాలని కాంగ్రెస్
నేతలకు సూచనలు చేశారు. కానీ, అవేవీ ఫలించలేదు. జనం పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్
నేతలకు ఉత్సాహాన్నిచ్చారు. ఈ సభలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ,
ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్,
డీసీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, శంకర్‌నాయక్,
చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు




