మునుగోడులో మునుగుతామని భయం..? బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటనమే

ముందే ముందస్తుకెళ్లాలని టీఆర్‌ఎస్‌లో చర్చ..
బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటమే
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలంటే కత్తిమీద సామే
టీఆర్‌ఎస్ ముఖ్య నేతల్లో మొదలైన గుబులు..
‘ముందస్తు’పై విపక్షంలోనూ మంతనాలు
మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు చేసేస్తే? ముందస్తు ఎన్నికలకు వెళ్తే?
టీఆర్‌ఎ్‌సలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే… బీజేపీ చేతిలో
ఓడిపోతే… ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలన పరిణామాలు, భారీగా వలసలకు అది కారణమవుతుంది. దానికి
మించి బీజేపీ బలంగా ఉందన్న సంగతి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మనసుల్లో నాటుకుపోతుంది. అందునా..
బీజేపీ బలంగా లేదని భావిస్తున్న నల్లగొండ జిల్లాలోనే ఆ పార్టీ గెలిస్తే ఒక్కసారిగా రాజకీయ వాతావరణమే
మారిపోతుంది. ఊహించని పరిణామాలు తెర మీదకు వస్తాయి. పైగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో
బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాకుండా ఏకంగా కేంద్ర పార్టీనే రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
రాజీనామా దగ్గరి నుంచి ప్రతి వ్యవహారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే జరిగింది.
‘రాజీనామా చేయండి, ఉప ఎన్నికల్లో గెలిపిస్తాం’ అన్న భరోసా అక్కడి నుంచే వచ్చింది. అంటే
ఈ ఎన్నికలపై హుజూరాబాద్ కంటే సీరియ్‌సగా బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టనుందని స్పష్టమైంది.
అలాంటి పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే, ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో పరిస్థితి చేజారి
పోతుందే మోనన్న ఆందోళన టీఆర్‌ఎ్‌సలో ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆ తర్వాత జరిగే
సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు. బీజేపీ గెలిస్తే.. ఇక విస్ఫోటమేవాస్తవానికి ఇప్పటివరకు
టీఆర్‌ఎస్ అంచనాల ప్రకారమే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి బలం లేదు. మిగతా జిల్లాల్లో ఆ పార్టీకి కొన్ని
చోట్ల బాగా బలం, మరి కొన్నిచోట్ల కొంతమేర మాత్రం బలం ఉందనేది అంచనా. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో
మాత్రం కచ్చితంగా బీజేపీకి ఇప్పటికైతే బలం లేదు. మరి అలాంటి బలం లేని నల్గొండ జిల్లాలోనే బీజేపీ
గెలిస్తే ఆ ప్రభావం అణు విస్ఫోటంలా అన్ని వైపులకు వ్యాపిస్తుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పెద్ద
ఎత్తున రాజకీయ చేరికలు చోటు చేసుకుంటాయి. బలం లేని ఆ రెండు జిల్లాల్లో బీజేపీ బలోపేతం
కావడమే కాకుండా, ఇప్పటికే బలమున్న మిగతా జిల్లాల్లో మరింత బలోపేతమవుతుంది.
ఇదే జరిగితే, ఆ తర్వాత సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కత్తిమీద సామే. విపక్షాల్లోను
మళ్లీ అదే చర్చఅధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందేమో అన్న చర్చ బీజేపీ,
కాంగ్రె్‌సలలోను జరుగుతోంది. కేసీఆర్ వచ్చే ఏడాది చివరి వరకు ఆగకుండా వచ్చే ఏడాది
తొలి త్రైమాసికంలోనే ఎన్నికలకు వెళ్లేలా అసెంబ్లీని రద్దు చేస్తారనే వాదన వచ్చింది. అప్పుడు
కేసీఆర్ విసిరిన ముందస్తు సవాల్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ కూడా సై అన్నారు. అమిత్‌షా కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు,
సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నికలకు
కాకుండా ముందస్తు ఎన్నికలకే కేసీఆర్ మొగ్గు చూపొచ్చని, దానికి తామూ సిద్ధమేనని విపక్ష
పార్టీలు అంటున్నాయి.



