ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
భారతదేశ జనాభా 140 కోట్లు అయితే, దేశంపై ఉన్న అప్పు మాత్రం 150 లక్షల కోట్లు ….

భారతదేశ జనాభా 140 కోట్లు అయితే, దేశంపై ఉన్న అప్పు మాత్రం 150 లక్షల కోట్లు ......సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి ఉమామహేశ్వర రావు ఎన్నో పోరాటాలు చేసి, త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి ఉమామహేశ్వర రావు అన్నారు . శుక్రవారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిర్రావూరు గ్రామం లైబ్రరీ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సభ జరిగింది. సామాజిక కార్యకర్త సీర్ల లాల్చంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వి ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చిన కేంద్ర, బిజెపి ప్రభుత్వం స్వాతంత్ర్య ఉద్యమంలో ఎటువంటి పాత్ర నిర్వహించలేదని ఆయన అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా మారారని ఆయన అన్నారు. స్వాతంత్ర ఉద్యమం కంటే పూర్వమే వీర తెలంగాణ పోరాటం,దున్నే వాడికే బూమి కావాలని పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులకు వుందని అన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో దేశానికి స్వాతంత్రం సాధించుకునేందుకు కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు. కానీ నేడు బిజెపి ప్రభుత్వం తామే దేశభక్తులమని చెప్తూ, హిందుత్వ ముసుగులో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. అదేవిధంగా భారతదేశంలోని సంపదను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ, బడా పెట్టుబడిదారుల ఆదాయాలను అమాంతంగా పెంచేస్తుందని ఆయన విమర్శించారు. స్వతంత్ర భారత వనిలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా భారతదేశ జనాభా 140 కోట్లు అయితే, దేశంపై ఉన్న అప్పు మాత్రం 150 లక్షల కోట్లు ఉందని అన్నారు.


