టీమిండియా 3-0తో వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం

టీమిండియా 3-0తో వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 36 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు
సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో వెస్టిండీస్
జట్టు బ్యాటింగ్ ఆడాల్సి వచ్చింది. DLS విధానంలో విండీస్ 35 ఓవర్లలో 257 పరుగులు చేస్తేనే విజేతగా
నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఈ లక్ష్య సాధనలో విండీస్ జట్టు చతికిలపడింది. 26 ఓవర్లకు 137 పరుగులు
మాత్రమే చేసి ఆలౌట్ కావడంతో విండీస్‌కు క్లీన్‌స్వీప్ తప్పలేదు. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా
క్లీన్‌స్వీప్ చేసింది. రెండో వన్డేలో అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ టీమిండియా క్రికెట్ చరిత్రలో
నిలిచిపోతుంది. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం
ట్రినిడాడ్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, పంత్, అశ్విన్, భువనేశ్వర్‌తో
కూడిన పూర్తిస్థాయి జట్టు శుక్రవారం నుంచి జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. కరోనాతో ఐసోలేషన్‌లో
ఉన్న రాహుల్ ఈ సిరీస్ ఆడే విషయంలో సందేహం నెలకొంది. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో
సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. కోహ్లీ టీ20లకు కూడా దూరంగా ఉన్నాడు.




