ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్ముఖ్యాoశాలు
పెద్దల సభలో నేరగాళ్లున్నారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సగం మంది పైగా నేర చరితులేనని ఓ సర్వేలో వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వెల్లడించిన తాజా నివేదిక ఓ సారి పరిశీలిస్తే… ఏపీ మండలిలో ఉన్న 58మంది సభ్యుల్లో అందుబాటులో ఉన్న 48మంది వివరాలను విశ్లేషించినట్టుతెలిపింది
తమకు తాముగా మండలిసభ్యులు అందించిన అఫిడవిట్లలోవారువెల్లడించిన నేర చరిత్ర ఆధారంగానే ఈవివరాలను వెల్లడిస్తున్నట్టు సదరు నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం వైసీపీకి సభలో 26మంది సభ్యులుండగా వారిలో 13మంది సభ‌్యులు వివిధ రకాల నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ సభ్యుల్లో 46శాతం మంది సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారే కావటం గమనార్హం. అంటే శాసన మండలి సభ్యుల్లో 20మందికి పైగా క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారన్నమాట.
. ఏపీ శాసన మండలిలో ఉన్న 58మంది సభ్యుల్లో 48మంది నామినేషన్ పత్రాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో వాటి ఆధారంగా అభ్యర్ధుల విద్యార్హత, క్రిమినల్ కేసులు, వయసు, ఆదాయం, ఆస్తుల వివరాలను ఏడిఆర్ విశ్లేషించింది.
టీడీపీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, బచ్చుల అర్జుడు నామినేషన్ పత్రాలు అందుబాటులో లేవు. కాఆ నామినేటెడ్ ఎమ్మెల్సీలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో 48మందినే ప్రమాణికంగా తీసుకున్నామని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ స్పష్టం చేసింది.



