తెలంగాణ

పారిశుద్ది కార్మికుల చేత జెండా ఆవిష్కరింప చేసిన జెనసేన 

” 75 వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఆవిష్కరించిన మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు”.*

కెపిహెచ్బి జనసేన పార్టీ 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్లా శంకర్ అధ్వరవం లో కేపీహెబ్ డివిజన్ పరిధిలో రమ్య గ్రౌండ్స్ వద్ద స్వంతంత్ర దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగ నాయకులు కోవిడ్ సమయం లో పారిశుధ్య కార్మికులు కృషి గుర్తుచేస్తూ పారిశుధ్య కార్మికురాలు చేత జాతీయ జెండా ఎగరవేయించారు…ఈ సందర్భంగ కొల్లా శంకర్ మాట్లాడుతు అంధరికి స్వాతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియజేస్తు కరోనా విపత్తు సమయంలో మహిళా పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు చేశారని అలాంటి వారి రుణం తీర్చుకోలేమని అన్నారు.మొదట, కొల్లా శంకర్ పారిశుధ్య కార్మికుల చిన్న బృందాన్ని సత్కరించారు, వారు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో మరియు “COVID-19 రహితంగా” ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం పారిశుధ్య కార్మికుల్లో అత్యంత వయోవృద్ధుడు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్, అంజి (కేబుల్) ,తుమ్మల మోహన్ కుమార్ ,హరీష్ ,వినోద్ , పసుపులేటి ప్రసాద్, రాజా, కిషోర్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు .
Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker