తెలంగాణ

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు అందజేస్తాం

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు అందజేస్తాం
ధరణి పోర్టల్‌తో భూ సమస్యలను పరిష్కరించాం?
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

ఎవరూ అధైర్యపడొద్దని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు. ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని
మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం ములుగు మండలం చిన్నతిమ్మాయపల్లి, నాగిరెడ్డిపల్లి, మర్కుక్‌ మండలం శివారు వెంకటాపూర్‌
గ్రామాల్లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్లు
నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో ఆలోచన చేసి డబుల్‌
బెడ్రూమ్‌ ఇళ్లను నిర్మించి అందిస్తున్నామని తెలియజేశారు. పేదలు ఇళ్లల్లోకి చేరుకోగానే వారి ముఖంలో చూసిన ఆనందానికి వెలకట్టలేమన్నారు.
ప్రధానమంత్రి మోదీ ఉచితాలు వద్దని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉపాధిహామీ పనికి రెండుసార్లు వచ్చి ఫొటో దిగితేనే పైసలు ఇస్తామని మోదీ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్‌ రైతులు, పేదల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి,
కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ములుగు జడ్పీటీసీ జయమ్మఅర్జున్‌గౌడ్‌, ఎంపీపీ లావణ్యాఅంజన్‌గౌడ్‌, , సర్పంచ్‌ మంజులానర్సింలు, ఏఎంసీ చైర్మన్‌లు జహంగీర్‌
, మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మర్కుక్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker