ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
రాబోయే ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ…..సోము వీర్రాజు

అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా ఉంటామని, అందుకోసమే రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాజధాని ఎవరైతే కట్టుకోలేదో వాళ్లదే పాపమన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో విషయంలో బాగా చర్చ జరుగుతోందని సోము వీర్రాజు అన్నారు. నిజ నిర్ధారణపై గట్టి ప్రయత్నం జరుగుతోందని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. బీజేపీ కూడా ఢిల్లీలో మహిళా కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చిందన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న విజయవాడలో బహిరంగ సభ జరుగుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోము వీర్రాజు పిలుపిచ్చారు




