All

దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2

దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2

ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. రావుల గౌరమ్మ సమర్పణలో సాయి విలా సినిమాస్ పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత జంటగా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గారు, రేలంగి నరసింహారావు గారు.గౌతం రాజు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి గారు. తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం కృష్ణ, సుమీత హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి దర్శకుడు బి. గోపాల్ గారు క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు..దర్శకుడు రేలంగి నరసింహారావు గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర దర్శకుడు : అశల పల్లకిలో అందరూ ఊగుతూ ఉంటారు.కానీ ఆ ఆశలు తీర్చుకొని ఎలా కోటీశ్వరులు అయ్యారు అనేదే ఈ సినిమా కథ. అయితే రాజమౌళి గారు నిర్మాతలు ఇచ్చిన బడ్జెట్ లో మిగిల్చి ఇవ్వడం అలవాటు. నేను అదే ఫాలో అవుతున్నాను.. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు వారికి.ధన్యవాదాలు. నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో తెరకేక్కించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker