నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం….కాంగ్రెస్‌లోనే ఉంటా.. ఇక్కడే చస్తా.

నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్‌లోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ”ఉపఎన్నిక కసరత్తు మీటింగ్‌కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్‌కు నేను ఎందుకు వెళ్తా?. ఇక, చండూరు సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హౌంగార్డుతో పోల్చారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. మరోవైపు.. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. నన్ను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాను అనుకున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు. ఈ పార్టీ నష్టపోతే.. ఐదో పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారు. మేం బ్రాండ్ షాప్ నడిపించే వాళ్ళం మా వల్ల ఏం జరుగుతుంది.. రేవంత్‌రెడ్డి ఐపీఎస్.. మేమంతా హౌంగార్డులం.. మా వల్ల ఏం కాదు. భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు.. నేను హౌంగార్డులమా..? ఐపీఎస్ కదా.. రేవంత్‌రెడ్డే మునుగోడును గెలిపించుకోమని చెప్పండి. జానారెడ్డి కూడా హౌమ్ గార్డు అన్నట్టే కదా? మరోవైపు.. ఠాగూర్ రెండు రోజులు ఇక్కడ ఉండి.. కనీసం నాకు ఫోన్ చేయలేదు. అన్ని విషయాలు సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటాను ” అని రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.ఆస్తుల విషయంలో చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ ” రేవంత్ రెడ్డి ఆస్తులు ఎన్ని, రాజగోపాల్ ఆస్తులు ఎన్ని లెక్క చూస్తే తెలుస్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడెక్కడ పని చేశారు అనేది చూపిస్తాడు.. రేవంత్ ఏం చేసి సంపాదించారు అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.. 1987 నుండి ఎవరి ఆస్తులు ఎన్నో చూద్దాం.. నీ చరిత్ర ఏంది? మీరు అవునన్నా .. కాదన్నా. రాజగోపాల్ రెడ్డి తమ్ముడే.. అతడిని కూడా ఎందుకు అలా అనడం అని ప్రశ్నించారు.



