18 ఎకరాల ఎఫ్ పి ఎల్ భూమిని మాయం చేయబోతున్న రియల్ మాఫియ

సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున స్కాం ఇరిగేషన్ అధికారులతో కుమ్మ క్కు అయినా…….. హెచ్ఎండిఏ అధికారులు…
ప్రొటెక్టెడ్ టేనేంట్(PT) 38E అంటే భూమిని గత కొన్ని సంవత్సరాలుగా కాపాడుతూ ఓనర్ కు విధేయుడై వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకు సాగించేవాడు. ఈ తరహా భూమిని కాపాడే వ్యక్తులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నందిగామ గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు 60 మంది వరకు ఉన్నారు. ఈ 60 మంది భూమి తాము వ్యవసాయం చేస్తున్నాము కాబట్టి తమ పరిధిలో ఉందని ఆశపడ్డారు ,కానీ ఉన్నతాధికారులు ఆ భూమిని ఓనర్ల అభ్యర్థన మేరకు వారు అమ్ముకోవడానికి అనుమతినిచ్చారు. 36 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న భూమిని ఒక్కసారిగా ఓనర్ల చేతికి ఎలా ఇస్తారు ఈ అనుమతి ఎలా ఇస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే. ఈ భూమి సర్వే నెంబర్ 168 ,169, 170 ,171, కాసరా,ROR లెక్కల ప్రకారం 170, 171 లలో 18 ఎకరాల భూమి ఎఫ్ పి ఎల్ లో ఉంది . ఈ భూమిని ఎవరు అమ్మ రాదు అని ఎక్కడా లేదు కానీ, ఈ భూమిలో ఎటువంటి శాశ్వత కట్టడం కట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూమిని కాపాడుతున్న రైతులు ఓనర్లతో కలిసి 18 ఎకరాల చెరువును పూడ్చివేశారు ,ఆనవాలు లేకుండా భూమిని మార్చి వేశారు, భూమిపై ఎటువంటి ఆనవాళ్లు లేకుండా భూమిని చెట్లతో నింపేశారు, రికార్డుల పరంగా భూమిని మార్చేందుకు hmda అధికారుల సహాయం తీసుకుంటున్నారు. మొత్తం భూమి 44 ఎకరాలు ఈ భూమి ని మొత్తం ఇటీవల అమ్మింది 270 కోట్లు, ఇంత సొమ్ము పెట్టి కొని ఎవర్ని ఈ పనికిరాని భూమిలోకి ఆహ్వానిద్దామని అనుకుంటున్నారు. 38E అంటే ఈ భూమి సాగు చేస్తున్న వారికి 60 శాతం, ఓనర్లది 40 శాతం, అని అధికారులు మర్చిపోయారా. 1954- 1955 కి ముందే ఈ భూమిని PTలకు 38E కిoదా ఇచ్చినట్లుగా కలెక్టరేట్ రికార్డులలో స్పష్టంగా ఉంది. మరి కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో…… వేచి చూడాల్సిందే.




