తెలంగాణ

సీఎస్‌కు బండి సంజయ్ లేఖ


తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సీఎస్‌ (CS)కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) సందర్శనకు బీజేపీ బృందానికి అనుమతివ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో బీజేపీ (BJP)కి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌ సహా.. 30 మంది బీజేపీ నాయకులు ఉంటారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ  బృందం  సందర్శిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామన్నారు. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించడానికి  బీజేపీ  బృందం  పర్యటిస్తుందన్నారు. 1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు  ప్రాజెక్టును సందర్శించాయన్నారు. 2004 - 2009లో జరిగిన జలయజ్ఞం పనులపై  వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker