తెలంగాణ

హెల్మెట్ బెల్ట్ (స్ట్రాప్) పెట్టుకోక‌పోతే రూ. వేయి జరిమానా

నగరంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదం జరిగినపుడు హెల్మెట్ పెట్టుకున్న ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలతో బయటపడిన ఘటనలూ చూస్తుంటాం. అయితే ఈ మధ్య కొందరు హెల్మెంట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ఇంకొందరు హెల్మెట్‌ ను పెట్టుకుని, బెల్ట్‌ను వదిలేస్తున్నారు. ఫలితంగా హెల్మెట్ తల నుంచి సులభంగా విడిపోయి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) రంగనాథ్ ప్రతి ద్విచక్రవాహనదారుడు తప్పక హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు. ‘‘హెల్మెట్ లేకుండా రోడ్ల పైకి వస్తే చర్యలు తప్పవు. కొందరు హెల్మెట్ ధరించి స్ట్రాప్ (బెల్ట్) పెట్టుకోవడం లేదు. ఇక నుంచి హెల్మెట్ ధరించకపోయినా.. దానికి బెల్ట్ పెట్టుకోక‌పోయిన రూ. వేయి జరిమానా విధిస్తాం. అలాగే నాణ్యత లేని హెల్మెట్లు పెట్టుకోవడం ద్వారా కూడా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నాసిరకం హెల్మెట్లను ధరించవద్దు. నాణ్యత లేని హెల్మెట్లు ధరించిన వారిపై, అలాగే వాటిని అమ్మే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. కుటుంబంలో నలుగురు ఉంటే.. నలుగురూ  బైక్‌పై వెళుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ప్రమాదం జరిగినప్పుడు భారీ నష్టం జరుగుతుంది. వాహనదారులంతా ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి. ఓవర్ లోడ్‌ (Overload)తో వెళుతున్న వాహనాల‌పై కూడా చర్యలు ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker