తెలంగాణ
అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయండి

సంగారెడ్డి జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి నూతన ఓటర్లుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో ఓటరు నమోదు చేయాలని సూచించారు. స్వయం సహాయ సంఘాలు, బూత్‌లెవెల్ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. రేషన్ డీలర్లను సైతం ఇందులో భాగస్వాములను చేయాలని, గరుడయా్పపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించారు.బీఎల్వోలు, సూపర్వైజర్లు ప్రత్యేక దృష్టిసారించి వారం లో75 శాతం ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, ఎన్నికల సూపరింటెండెంట్ వెంకటేశ్ పాల్గొన్నారు.



