తెలంగాణముఖ్యాoశాలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు

వైద్యం అంతు చిక్కక ప్రాణాలు పోతున్న డబ్బులు కట్టాల్సిందే అంటున్న ఆసుపత్రులు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ప్రైవేట్ ఆస్పత్రులు చేతకాని వైద్యం చేస్తూ చిన్న రోగానికి ప్రాణాలు తీస్తున్న వైనం, హైదరాబాదులో చోటు చేసుకుంటుంది. జలుబుతో వచ్చిన, తలనొప్పితో వచ్చిన, అన్ని బ్లడ్ టెస్ట్ లు ఎక్స్రేలు ఈసీజీలు అన్ని రకాలు అయిపోయిన తర్వాత వైద్యం అర్థం కాకపోతే ఆసుపత్రిలో చేరాల్సిందే అని చెబుతారు. తీరా ఆస్పత్రిలో చేరాక వైద్యం చేస్తున్నాం లోపలికి ఎవరు రాకూడదు అని చెబుతూ ,చిన్న రోగానికి ప్రాణాలు తీసేసి పేషెంట్ వీక్ గా ఉన్నాడని చెప్పి తప్పించుకుంటారు. ఆ తర్వాత శవాన్ని ఇవ్వమంటే వైద్యం చేసిన బిల్లు కడితే శవాన్ని ఇస్తా అంటూ వారి సెక్యూరిటీని తీసుకొచ్చి బయటకు నెట్టిస్తారు. ఇది ప్రైవేటు ఆసుపత్రుల పనితీరు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులకు నేరుగా చేతకాదు, ఎందుకంటే వాళ్లకి ఆ రైట్స్ లేవు, మెడికల్ బోర్డుకు జరిగిన ఉదంతాన్ని పేపర్ ద్వారా తెలియజేసిన, వారు ఎటువంటి చర్యలు తీసుకోరు ఇటువంటి వారిపై కేసులు పెట్టాలంటే చాలా నీయమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ కేసు పెట్టి వారి దగ్గర నుండి సమాధానం వచ్చేసరికి రెండు మూడు సంవత్సరాలు గడిచిపోతుంది, వారి చుట్టూ తిరగడానికి ఓపిక లేక బాధితులు రాజీకొస్తారు. ఇంతే ఇదే ఆస్పటల్ మాఫియా , ఆసుపత్రుల్లో జరిగే ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటే డబ్బులు ఎక్కువగా రావచ్చు అని తెలుసుకున్న అంబులెన్స్ డ్రైవర్లు సైతం పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్తారు, అక్కడ ట్రీట్మెంట్ కంటే శుభ్రత ఎక్కువ ఉంటుంది. ఆపై భద్రత కూడా ఎక్కువే మనిషి బతికి వస్తాడని, గ్యారెంటీ లేదు కాబట్టి ,ఆసుపత్రిలో చేర్చుకుంటే తప్పనిసరిగా వారి దగ్గర కాంప్రమైజ్ సర్టిఫికేట్ పై సంతకం తీసుకుంటారు. చిన్న వైద్యానికి కూడా వారాలు నెలలు గడిపేస్తారు బతికితే మన అదృష్టం బతకకపోతే మన దురదృష్టం ఏది జరిగిన ఆసుపత్రికి మాత్రం బిల్లు కట్టాల్సిందే. వేయి రూపాయలతో పోయే ఖర్చు లక్షలు దాటుతుంది. ఉన్న స్థలాలు పొలాలు అమ్ముకొని ఆస్పత్రులకు పెట్టాల్సిందే ఇలాంటి నియమ నిబంధన మధ్య ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అవసరం కాబట్టి తీసుకోక తప్పడం లేదు ప్రభుత్వం తమ పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని కొన్ని సార్లు రాజ్యాంగంలోని కొద్దిగా నిబంధనలను సవరిస్తారు ముఖ్యంగా కెసిఆర్ అలాగే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల పైన కూడా తప్పు జరిగింది అంటే వారిపై డైరెక్ట్ గా చర్యలు తీసుకునే విధంగా నియమ నిబంధనలు సవరిస్తే బాగుంటుంది మెడికల్ మాఫియా ఆగడాలు.......... ప్రైవేటు ఆసుపత్రి వైద్యం సగం ప్రాణం తీస్తే మెడికల్ మాఫియా మరో సగం ప్రాణం తీస్తుంది వారి కంపెనీ ప్రయోగాల కోసం కొత్త రకం టాబ్లెట్లను ఆస్పత్రులకు తరలించి డాక్టర్ల అనుమతి కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తూ సీనియర్ డాక్టర్లను జూనియర్ డాక్టర్లను సైతం మాయ చేసి వారికి బహుమతులు ఇచ్చి వారి దగ్గర తయారయ్యే కొత్త రకం మందులను పేషంట్లపై ప్రయోగించేటందుకు సిద్ధం చేస్తారు ఏ మందులు వాడితే పేషెంట్ బతుకుతాడో ఆ మందులు వాడకుండా మెడికల్ మాఫియా వారు తెచ్చిన మందులను ట్రయల్ గా చూపించి వాడతారు పేషెంట్ చనిపోతే చేతులెత్తేస్తారు డాక్టర్లకు దయ దక్షిణ్యం పుణ్యం పాపం ఏమీ ఉండదు చనిపోయే వ్యక్తి ప్రాణం పోతే ఎంత నష్టం జరుగుతుంది ఆ కుటుంబానికి అనే ఆలోచన వారికి ఉండదు చనిపోయేది నా మనిషి కాదు కదా నాకు డబ్బులు వస్తే చాలు అన్న విధంగా తన డ్యూటీ తను చేసుకొని వెళ్ళిపోతుంటారు పోలీసుల వివరణ...... ప్రైవేటు వైద్యులు చేసిన వైద్యం వికటించి రెండు ప్రాణం పోతే వారిపై కేసు పెట్టమని అడిగితే పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పక్కన పడేస్తారు ఎందుకంటే మీరు ఎక్కువ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్నిటిని మెడికల్ బోర్డుకి పంపించాలి. మెడికల్ బోర్డు తీసుకునే నిర్ణయాలకు మాత్రమే పోలీసులు అమలు చేయాలి అందువల్ల తప్పు చేశాడని ఎదుట కనపడిన పోలీసులు ఏమీ చేయలేరు మెడికల్ బోర్డు చేయాల్సిందే



