తెలంగాణముఖ్యాoశాలు

కేసీఆర్ ఇంట్లో ఎందుకు సోదాలు చేయడం లేదు……రేవంత్ రెడ్డి

\ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ఇంట్లో ఎందుకు సోదా చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి  ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలపై తక్షణం దర్యాప్తు జరిపించాలని, జాప్యం చేస్తే ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని రేవంత్‌ అన్నారు. కేసీఆర్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్, మంత్రులను కలిశారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్‌కు ఆర్థిక సహాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కేసీఆర్, ఆయన కుటుంబాన్ని కేంద్రం ఎందుకు విస్మరిస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. సోదాలను ఐటీ అధికారులు అధికారికంగా ఎందుకు వెల్లడించడం లేదు. ఎన్నికలప్పుడు భయపెట్టి లొంగదీసుకోవడం బీజేపీకి అలవాటు. సీబీఐ, ఈడీ బీజేపీ అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నాయి. బీజేపీ, టీఎర్ఎస్ కలిసి కట్టుగా నాటకాన్ని రక్తి కట్టిస్తున్నాయి. భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలపై.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ నెలాఖరు వరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం. అని రేవంత్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker