పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ సిఐ, ఎస్ఐ లకు రాఖీలు కట్టిన మహిళా కానిస్టేబుళ్లు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో శుక్రవారం నాడు ఉదయం రాఖీ పౌర్ణమి సందర్భంగా పంజాగుట్ట సిఐ హరిచంద్ర రెడ్డి వారి ఎస్సైలు మహిళా కానిస్టేబుళ్లు ఇతర కానిస్టేబుళ్లు అందరూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎస్ఐలకు సీఐ కి రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సిఐ హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది సోదర భావాన్ని సూచిస్తుందని రాఖీ పౌర్ణమి చిన్నలకు పెద్దలకు అన్నాచెల్లెళ్లకు అక్కా తమ్ముళ్లకు ఎంతో ఆనందకరమైన రోజు అని ఎటువంటి సోదరీ సోదరులైన తమకు అండగా ఉండాలని సోదరుడు ఆద్యంతం సిరి సంపదలతో వెలగాలని కోరుకుంటూ రక్షాబంధన్ చేతికి కట్టే ముందు నుదుట కుంకుమ పెట్టి ఆ తర్వాత రక్షాబంధన్ కట్టి స్వీట్లు తినిపిస్తారని వీటన్నిటికీ గుర్తు జీవితాంతం తల్లి తండ్రి లేకపోయినప్పటికీ నేనే తల్లిదండ్రిని నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తానని సోదరుడు సోదరితో చెప్పే అపురూపమైన సంఘటనని ఆయన చెప్పుకొచ్చారు ఎటువంటి వ్యక్తిలోనైనా చెడు ఆలోచనలు లేకుండా సోదరీ భావంతో రాఖీ పండగ రోజు కాకుండా అన్ని రోజుల్లోనూ మెలిగే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.




