తెలంగాణ

రోడ్డు ప్రమాదం – ఐదుగురి మృతి – మరో ఐదుగురికి గాయాలు

కర్ణాటక రాష్ట్రం బీదర్ తాలూకా బంగూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దైవ దర్శనం కోసం వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన గిరిధర్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. కలబురగి జిల్లా గంగాపూర్‌ దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు  కుటుంబసభ్యులతో కలిసి కారులో బయలుదేరారు. వీరి ప్రయాణిస్తున్న కారు బీదర్‌లో కంటైనర్‌ను ఢీ కొట్టింది. గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేక్ (2), డ్రైవర్ జగదీష్ (35) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధనను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బీదర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker