తెలంగాణముఖ్యాoశాలు
అక్కడ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి…. మేయర్

హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది నగరంలోని ముసరాంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహించడంతో ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు పురాతన బ్రిడ్జి కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి రాకపోకలు నిలిపివేశారు ఇవాళ అర్ధరాత్రి బ్రిడ్జిపై వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు మూసీ నది వరద ఉధృతి పెరిగే పెరిగితే బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిపివేస్తామని జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జయం తెలిపారు భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నచోట వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి కోరారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదురైనప్పుడు జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 0402 111 11 11 సంప్రదించాలని సూచించారు కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతం లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు సూచించినట్టు మేయర్ తెలిపారు



