తెలంగాణ

మతాలకు అతీతoగా కలిసి నడుస్తున్న ముస్లిం సోదరులు

 వినాయక నిమజ్జనానికి వెళుతున్న వారికి పులిహోర మంచినీరు అందిస్తున్న వైనం
 ఎస్సార్ నగర్ సర్కిల్ పరిధిలో  ముస్లింసోదరులు హిందూలకు ఫలహారాల మంచినీళ్ళ పంపిణీ.
 సిటీ క్రైమ్ మేజర్ న్యూస్

ఎవరి పండగ వారిదే, వారి పండగలు మనం జరుపుకోవడం మన పండుగకు వారు రావడం ఇది ఎప్పటి సంప్రదాయం దాదాపు 100 సంవత్సరాల పైగా మన పూర్వీకులు కలిసి జరుపుకున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు ఎస్సార్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు అందర్నీ ఒకచోట చేర్చి తాను చేయగలిగినంత మంచిని శుక్రవారం నాడు ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలో చేశారు.వినాయక నిమజ్జనం ను ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వారి ప్రేరణ,సహకారం తో ఆల్ మస్జీద్ కమిటీ వారు వినూత్నంగా నిర్వహించారు.గత కొన్ని రోజులుగా మతాలకతీతంగా  నిమజ్జనం జరపడానికి కృషి చేస్తున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు మస్జీద్ కమిటీల వారికి సహకారం అందించగా,నిమజ్జనానికి వినాయక విగ్రహాలతో వస్తున్న హిందూ సోదరీ సోదరులకు ముస్లిం సోదరులు ఫలహారంగా పులిహోర, మంచినీటి ప్యాకెట్ లు అందజేయడం తెలంగాణ రాష్ట్రం లో గంగా జమున తెహ్రీబ్ సంస్కృతికి  అద్దం పడుతుంది.ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ఎస్ ఆర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు కు ఆల్ మస్జీద్ కమిటీ వారితో సహా ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker