తెలంగాణ
ప్రాణం నష్టం జరగకుండా చూడండి కేటీఆర్
హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగరంతో పాటు రాష్ట్రంలో పలు పట్టణాల్లో జిల్లాల్లో పరిస్థితులపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్ష నిర్వహించారు ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిహెచ్ఎంసి జలమండలి పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలక పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు హైదరాబాద్ నగరంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రమాదం జరిగే స్థానం నుండి ప్రజలను తరలించి వారికి కావలసిన అన్ని సౌకర్యాలు చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు



