ఈ రోజు ఉదయం 11.30 గంటలకు అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో రెడ్ సిగ్నల్

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ జరుపుకోనున్నట్లు గతంలోనే ప్రకటించింది. వేడుకల్లో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 11:30 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతం ఆలపించడం జరుగుతుందని, ఇందులో అందరూ పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాలని, చెప్పిన సమయంలో ట్రాఫిక్, సందడి లేకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భం గా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరగనున్నందున ఆగస్టు 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌లో జాతీయ గీతం ప్లే చేయబడుతుంది మరియు అన్ని ట్రాఫిక్ సిగ్నల్‌లు ఎరుపు రంగులోకి మారుతాయి, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది నిర్వహించే అన్ని జంక్షన్‌లు కూడా ఆగిపోతాయి. ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపించాలని పోలీసులు ప్రయాణికులను కోరారు. ఆదివారం, ఆగస్ట్ 14, హైదరాబాద్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ , ఒక పత్రికా ప్రకటనలో, “ఉదయం 11.30 గంటలకు అన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌లో జాతీయ గీతం ప్లే చేయబడుతుంది. పౌరులు/ప్రయాణికులందరూ నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని అభ్యర్థించారు.


