తెలంగాణ
అధికార మదంతో భూకబ్జాకు పాల్పడుతున్న జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా,
జిన్నారం మండల కేంద్రం లోని లక్కిరెడ్డి గారి నరేందర్ రెడ్డి,తండ్రి లక్కిరెడ్డి గారి రాంరెడ్డి. జిన్నారం గ్రామంలోని తమకి సంబందించిన ,పేరడ్,స్థలాన్ని స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, మరియు కొంతమంది కలిసి కబ్జా చేశారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.40 సంవత్సరా ల నుంచి మేము సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు.ఈ మధ్య కాలంలో భూములకు ఆగంథంగా ధరలు పెరగడంతో, దానికి తోడు స్థానికంగా మేము ఇక్కడ లేకపోవడంతో బరి తెగించి కబ్జాలకు దిగారు. ఈ విషయంపై స్థానిక పొలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని తెలిపారు. ఎలాగైనా తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉన్నత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డి గారి జానకి ,కంది ఎల్లయ్య,మున్ని వీరయ్య,జంగగొని దుర్గయ్య,తదితరులు పాల్గొన్నారు.



