అద్దె కొచ్చి…. ఇల్లుకా జేసిన వైనం మహానగరంలో జిహెచ్ఎంసి మాయ లీలలు

ఆరోగ్యం బాగాలేక ఇల్లు అద్దెకిచ్చి ఆసుపత్రిలో చేరిన వ్యక్తి తిరిగి వచ్చేసరికి ఇల్లు అమ్మేసిన తీరు చూస్తే మనం సమాజంలో నివసిస్తున్నామా ,న్యాయం అంటూ ఒకటుందా ,కొన్ని సంఘటనలు అలాగే అనిపిస్తున్నాయి. కుతుబుల్లాపూర్ రాజీవ్ గాంధీనగర్ లో నివాసం ఉంటున్న భల్లం కనకరాజు అనే వ్యక్తి తనకు పెరాలసిస్ వచ్చిందని ఆసుపత్రిలో చేరాడు, అంతకుముందు ఒక వ్యక్తికి ఇల్లు అద్దెకి ఇచ్చాడు ఆ వ్యక్తి కనకరాజు తిరిగి వచ్చేసరికి ఆ ఇంటిని మరో వ్యక్తికి అమ్మేసి కనకరాజు పేరు మీద ఉన్న ప్రాపర్టీ టాక్స్ ను ఆవుల సువర్ణ అనే ఆమె పేరు మీదకి వచ్చే విధంగా చేశారు కనకరాజు వచ్చేసరికి జరగాల్సిన పనులన్నీ జరిగిపోయాయి . అదేమని విచారించగా అతని ఇల్లు అతనికి తెలియకుండానే ఇంట్లోకి అద్దెకి వచ్చిన వ్యక్తి ఆ ఇంటిని అమ్మేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా వారు విచారణ చేస్తామని అన్నారు రాజీవ్ గాంధీనగర్ లో సర్వేనెంబర్ 79 లో 90 గజాలలో రాజీవ్ నగర్ లో ఇల్లు నిర్మాణం జరిగింది. ఈ డోర్ నెంబర్లు పి టి ఐ నెంబర్లు మార్చడానికి కుతుబుల్లాపూర్ కు సంబంధించిన జిహెచ్ఎంసి సిబ్బంది 1,50,000 లంచం తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీనిపై జిహెచ్ఎంసి తక్షణమే స్పందించి కనకరాజుకు న్యాయం చేస్తారా లేదా వందలో ఇది ఒకటి అని వదిలేస్తారు. డోర్ నెంబర్లు మార్చడం పిటిఐ నెంబర్లు మార్చడం వల్ల జిహెచ్ఎంసి సిబ్బందికి తాత్కాలికంగా డబ్బులు వస్తాయి కానీ, ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగాలకు ఎసరు మాత్రం వస్తుంది .ఇదే తరహాలో యూసఫ్ కూడా జిహెచ్ఎంసి పరిధిలో కూడా జరిగింది. ప్రాపర్టీ టాక్స్ నెంబర్లు మార్చి ఒక వ్యక్తి తన తోటి సోదరీ సోదరులకు తెలియకుండా తన కూతురు పేరు మీద ఆస్తిని గిఫ్ట్ డిడి కింద మార్చుకున్నాడు దీనిపై సమగ్ర విచారణ జరుగుతుంది. ఎటువంటి ఆలోచన చేయకుండా ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ 2019లో గిఫ్ట్ డిడి చేశారు దాని ఫలితం త్వరలో వస్తుంది.



