తెలంగాణముఖ్యాoశాలు

2021లో ఉన్న యజమానుల పేర్లు …..2016లో ఎక్కడికి పోయాయి

343 సర్వే నెంబరు సర్వే అసలు పూర్తవుతుందా?

  అమీన్పూర్ 343 సర్వే నెంబర్లు సర్వే చేయడానికి దాదాపు జూన్ నెల 2020 సంవత్సరం నుండి అధికారులు సర్వే చేస్తూనే ఉన్నారు మరి ఈ సర్వే ఎప్పటికి పూర్తవుతుంది అసలు పూర్తవుతుందా కాదా? మాకు ల్యాండ్ ఉంది అని చెప్పి సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన పెద్ద మనుషులు దాదాపు రెండు వేల మందిని మోసగిచ్చి 1500 కోట్ల రూపాయలు కాజేసినట్టు బాధితులు చెప్పుకుంటూ రోడ్ల వెంబడి తిరుగుతున్నారు ఇలా మోసం చేసిన వారిలో చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు ఒకరి నుంచి మరొకరు వారి నుంచి ఇంకొకరు మాకు ఉందంటే మాకు ఉందని చెప్పి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని వారి మీద తమ ప్రతాపాన్ని చూపించారు ఫ్రీ లాంచ్ పేరుతో 2000 వేల మందిని ఇబ్బందులు పెడుతూ డబ్బులు ఎగనామం పెట్టే యోచనలో ఉన్న సాహితీ ఇన్ఫ్రా కంపెనీ, నా దగ్గర భూమి ఉన్నది ఆ భూమిలో కట్టడాలు నిర్మిస్తాను అని చెబుతున్న భూమి 24 ఎకరాలు సర్వేనెంబర్ 343 లో ఉంది. నాలా కన్వర్షన్ చేసి వ్యవసాయ భూమి నుండి ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా భూమికి సంగారెడ్డి ఆర్డీవో 2016లో పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ చాలా త్వరగా ఎంతో ఉత్సాహంగా జరిగిందని చెప్పుకోవచ్చు ,నిజానికి ఫీనిక్స్ కంపెనీలో శ్రీకాంత్ బడ్గా అనే వ్యక్తి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన నాలుగవ తేదీ జూలై 2016లో నాలా కన్వర్షన్ కోసం పటాన్చెరువు మండలంలో తాసిల్దార్ కు దరఖాస్తు చేసుకున్నారు, వెంటనే తాసిల్దార్ ఏమాత్రం లేట్ చేయకుండా ఆరు జూలై 2016 ని తన ఒపీనియన్ ను ఆర్డిఓ సంగారెడ్డికి పంపించడం జరిగింది ,ఆర్డీవో సంగారెడ్డి లో డి శ్రీనివాసరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు తాసిల్దార్ ఇచ్చిన ఫైల్ ను చూసుకున్న ఆర్డిఓ ఎస్ టి ఓ కి ప్రొసీడింగ్ నెంబర్ A2/6956/2016,A2/6952/2016 ద్వారా ఒక కోటి 18 వేల రూపాయలు ఫీజుగా 25 అక్టోబర్ 2016 చెల్లించారు. వెంటనే 26 అక్టోబర్ 2016 న నాలా కన్వర్షన్ పూర్తి చేసి సదర్ ఫైనాన్సు కంపెనీకి భూములు అప్పజెప్పారు ఇంత త్వరగా తాసిల్దార్ ఫైన్ కదపడం ఆర్డీవో ఫైల్ ను సకాలంలో మూడు నెలల లోపే కన్వర్షన్ను పూర్తిచేసి పంపించడం వెనుక ఎంతో మతలబులు ఉన్నాయి, ఇది ఇలా ఉంటే 2021లో ఆర్టిఏ యాక్ట్ ద్వారా అమీన్పూర్ కు సంబంధించిన భూముల విషయాలు తీసుకున్న నేపథ్యంలో ఆ భూములు రైతుల పేరు మీదే ఉన్నాయి అలాంటప్పుడు 2016లో నాలా కన్వర్షన్ అయితే 2021లో ఆర్టిఏ యాక్ట్ కింద అప్లై చేసిన వారికి పాత వారి పేర్లతో భూమి రికార్డులు ఇవ్వడం ఎంత నేరం. ఒకవేళ భూమి కొన్న రైతులు మోటివేషన్ చేసుకోకపోతే ఆ పేర్లు వచ్చే అవకాశం ఉండొచ్చు కానీ ఫినిక్స్ లాంటి పెద్ద కంపెనీలు భూమి కొన్న తర్వాత వారి పేర్లు మార్పిడి చేసుకోవడానికి ఏమాత్రం వెనక్కి పోవు 2016లో కన్వర్షన్ గురించి పెట్టిన దాదాపు అన్ని ఫైలు సంవత్సరాలు తరబడి పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఫైల్స్ మాత్రం ఎలా తొందరగా బయటికి యల వచ్చాయి అది దేవుడికి తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker