ఎట్టకేలకు మారేడ్పల్లి మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కు బెయిల్

ఎట్టకేలకు మారేడ్పల్లి మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కు బెయిల్ మంజూరు అయింది. రూ.లక్ష పూచికత్తుతో నాగేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కిడ్నాప్, అత్యాచారం కేసులో నాగేశ్వరరావు జైలుకెళ్లిన విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా రూ. లక్ష పూచికత్తుతో పాటు, పలు షరతులు విధిస్తూ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. రెండు నెలల పాటు ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విచారన అధికారి ముందు హాజరుకావాలని నాగేశ్వరరావుకు హైకోర్టు షరతు విధించింది. కాగా… తన భర్తపై దాడి చేయడంతో పాటు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ నాగేశ్వరరావుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం, ఆయుధ చట్టం కింద నాగేశ్వర్రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.విడుదల అయిన తర్వాత నాగేశ్వరావు తన నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకుంటాడు బెయిల్ మాత్రమే వచ్చింది. కేసు విచారణ కొనసాగుతూ ఉంటుంది కదా మరి ఎట్లాంటప్పుడు సాక్షులను తారుమారు చేసే అవకాశం లేదా మరి ఏం జరిగిందో వేచి చూడాల్సిందే




