సినిమాలు

గ్రాండ్ గా “రుద్రవీణ” ప్రి రిలీజ్..ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రుద్రవీణ’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత రాగుల లక్ష్మణ్, మాట్లాడుతూ..మా రుద్ర వీణ ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు ఇందులో ఎల్సా, శుభశ్రీ లు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అలాగే మరో నటి సోనియా లేడీ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ చేసింది.ఇలా ఇందులో ఉన్న ముగ్గురు అమ్మాయిలు చాలా కష్టపడి పని చేశారు.రఘు కుంచె విలన్ గా అద్భుతమైన నటనను కనపరచ్చాడు. హీరో కు ఈ సినిమా తర్వాత మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా మనం ఎప్పుడూ చూడని కథను చూస్తారు. ఇందులోని పాటలు అన్నీ ఆణిముత్యాల్లాగా అద్భుతంగా వచ్చాయి .మనకు జరిగే ప్రతి ఫెస్టివల్ లో ఈ సాంగ్స్ ప్లే అయ్యేలా ఉంటాయి. మంచి కాన్సెప్ట్ తో ఈ నెల 28 న థి యే టర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రుద్ర వీణ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

మరో నిర్మాత రాగుల శ్రీను మాట్లాడుతూ…మా అమ్మ గారి నిర్మాణంలో మేము ఈ సినిమా తీశాము.చిన్నప్పటి నుండి మేము చిరంజీవి కి బిగ్ ఫ్యాన్స్ .అయితే ఇప్పుడు మేము తీసిన సినిమాకు చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా “రుద్ర వీణ” టైటిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రఘు కుంచె విలన్ గా చాలా బాగా నటించారు. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల 28 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker