
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నాగచైతన్య – పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుందని సమాచారం.కాగా ఈ చిత్రానికి ‘నాగేశ్వరరావు’ అనే పేరు ఖరారు చేసినట్టు ఫిలింనగర్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా `గీత గోవిందం` సెంటిమెంట్‌తో ఈ సినిమాలోనూ రష్మికనే తీసుకోవాలని నిర్మాతలు యోచిస్తున్నట్టు తెలియవచ్చింది.
మరోవైపు ఈ సినిమాలో కథానాయిక పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్య్టా ఓ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని అందుకు అభినయాన్ని ప్రదర్శించే నాయిక కీర్తి సురేష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉన్న చైతు. పూర్తి సాంకేతిక నిపుణులు, నటీనటులు ఖరారు చేయగానే `నాగేశ్వరరావు` ని రడీ చేసేందుకు సిద్దం అవుతున్నట్టు సమాచారం.



