
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన పాలనా సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని దీనిపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశాలించాలంటూ 2005లో నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ ఆరంభించింది, ఈ కేసు ఇంకా ఫిర్యాదు దశలోనే ఉన్నందున చంద్రబాబు న్యాయవాదుల వాదనలు వినాల్సిన అవసరం లేదంటూ గతంలో లక్ష్మీపార్వతి చేసిన వినతిని కోర్టు ఆమోదించింది ఈ ఫిర్యాదు విచారణ జరగకుండా చంద్రబాబు గతంలో హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు అందుకున్నా, గతేడాది సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలకే కుదించడంతో స్టే ఆదేశాలు కొనసాగింపు ఉత్తర్వులు లేకుంటే స్టే రద్దయినట్లేనని భావించాలని సూచించింది.
ఈ క్రమంలోనే తన ఫిర్యా దుపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలనంటూ లక్ష్మీపార్వతి ఏసీబీ కు ఫిర్యాదు దాఖలు చేసారు. హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, వాటినీ పరిశీలించాకే ఫిర్యాదుపై నిర్ణయాన్ని తీసుకుంటామని ఏసీబీ కోర్టు చెప్పింది. ఈ నెల 26కు కేసును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ..


