Allగోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు

01 . CAA & NRC లకి వ్యతిరేకంగా నిరసన లు చేసే వారిపై రాళ్ళతో కత్తులతో దాడులకి దిగుతాం – మహారాష్టూర నవ నిర్మాణ సేన రాజ్ ఠాక్రే …
మాంచి ఊపు మీద ఉత్సాహం మీద ఉన్నాడు – బెదర్ని బంగ్లాదేశ్ బార్డర్లో పడేసొచ్చేయండ్రా .. !!
02. భారత పౌరసత్వం ఇస్తామని ప్రకటించాలే గానీ సగం బంగ్లాదేశ్ ఖాళీ అయిపోతుంది – కిషన్ రెడ్డి …
అప్పుడెంచక్కా భారతీయులు బారులు తీరి బజారులో అడుక్కు తింటారు …!!
03. నియామకాల్లో SC – ST ల రిజర్వేషన్లు రాష్ట్రాల ఇష్టం – కానీ ప్రమోషన్లలో రిజర్వేషన్లు అడిగే హక్కు వారికి లేదు – సుప్రీం కోర్టు …
ఏ హక్కుల్లేకపోయినా ఓటు హక్కనేది ఒకటేడిసిందిగా సామీ – దాని ముందర అన్నీ బలాదూరే – ఎంతటోడన్నా మూస్కుని చెయ్యాల్సిందే …!!
04. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ( సెయిల్ ) లో మరో 5% ప్రభుత్వ వాటాని అమ్మాలని నిర్ణయించిన – కేంద్రం  …
జనాలకి ఏటీయమ్ముల్లా ప్రభుత్వాలకి ఇవి అలాగన్న మాట – ఎప్పుడు డబ్బులవసరం వస్తే అప్పుడు అమ్ముకు….బ్బుతుంటారు …!!
05. పది రూపాయల నాణేలు చెల్లవు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు – పది రూపాయల నాణేలు చెల్లుతాయి – ఆర్బీఐ…
ఆ ముక్క జనాలకి తెలుసు గానీ – ఏదట్టు కెళ్ళినా మేం తీస్కోం అని మొహం మీద చెప్పే బ్యాంకర్లకి చెప్పండి – ఆళ్ళు తిన్నంగేడిస్తే ఈ వార్తలకి సంజాయిషీలిచ్చుకోవలసిన ఖర్ముండదు మీకు …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker