All
సిపిఐ నారాయణ పై పోలీసులకు చిరు అభిమానులు పిర్యాదు

సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ పద్మభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి ని చిల్లర బేరగాడు , రాజకీయ బేరగాడు , రాజకీయ బ్రోకర్ అని ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాధ్యతగల జాతీయ రాజకీయాల్లో ఉంటూ చిరంజీవి గారి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి సి పి ఐ శ్రేణుల మధ్య చిరంజీవి అభిమానుల మధ్య మరియు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు మధ్యన గొడవలు జరిగి సంఘ విద్రోహం జరిగే ఈ విధంగా విభేదాలు సృష్టించడం అని కుట్రపూరితంగా మాట్లాడి న సిపిఐ నారాయణ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసైనికులు వీర మహిళలు మరియు మెగా అభిమానులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో సీఐ కిషన్ కుమార్ గారికి వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రెటరీ మండలి దయాకర్ కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు కొల్లా శంకర్ ,దుర్గా శ్రీనివాస్ ,అంజి హరీష్ ,వెంకటేష్ మరియు వీర మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాగ్యలక్ష్మి , మహాలక్ష్మి లతో పాటు మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు



