
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. మీరు, మీ 22 మంది ఎంపీలు ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారోనని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు.
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళల మీద ప్రతాపం చూపించడం కాదు… కేంద్రం మీద మీ ప్రతాపం చూపించి ప్రత్యేక హోదాను సాధిస్తే మంచిదని ఎద్దేవా చేశారు.




