Allవార్తలు

భర్త తన భార్య తల నరికి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు

దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భర్త నిర్దాక్షిణ్యంగా తన భార్య తల నరికి.. దాన్ని చేతితో పట్టుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జహంగిరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బహదుర్‌పూర్‌ గ్రామంలో అఖిలేష్ రావత్ అనే వ్యక్తి తన భార్య రజినీ,ఒక పాపతో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యం కారణంగా వారి పాప చనిపోయింది. ఈ కారణం చేత అఖిలేష్ తన భార్యాతో తరుచు గొడవ పడుతుండే వాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దానితో కోపం తెచ్చుకుని అఖిలేష్ తన భార్యను ఇంటి బయటికి ఈడ్చుకొచ్చి పదునైన కొడవలితో తలని నరికి చంపేశాడు. 

అంతటితో ఆగకుండా ఆమె తలను పట్టుకుని ఆ ఏరియాలో తిరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని అఖిలేష్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతడు వారితో గొడవ పడి తప్పించుకున్నాడు. అయితే చివరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలను స్వాధీనం చేసిన అఖిలేష్ జరిగిన విషయాన్ని వివరించి లొంగిపోయాడు. అంతేకాక జాతీయ గీతాన్ని కూడా  ఆలపించాడు. అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవే హత్యకు దారి తీసి ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker