తాజాగా ప్రపంచాన్నిగజగజలాడుస్తున్ న కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లే కాదు.. సినిమా పరిశ్రమ ని కుదేలెత్తిస్తున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా…. కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్దమవుతున్నారు నిర్మాతలు . కరోనా అనే వచ్చేలా టైటిల్స్‌ను రిజిష్టర్ చేయించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ముందుగా ‘కరోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించుకోవటంతో సంచలనమైంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తామని సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
ఇండియన్ సినిమాపై కరోనా వైరస్ పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదా పడుతుండగా సినిమా థియేటర్స్ , పాఠశాలలను బంద్ చేయాలని సూచించడంతో ఈ నెల 31 వరకు అన్ని దాదాపు బంద్ కానున్నాయి. దీంతో ఉగాదికి రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడినట్టే. ఇప్పటికే సినిమా బిజినెస్ పై ప్రభావం చూపిన కరోనా రానున్న రోజుల్లో కలెక్షన్స్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేక పోలేదు.



